Citizen Outreach Campaign
గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సిటిజన్ ఔట్రీచ్ అనే ప్రోగ్రాం ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలు అందుబాటులో ఉంటాయి.
సర్వే పేరు : సిటిజెన్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ ప్రోగ్రాం
ముఖ్య ఉద్దేశ్యం : ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటిని పరిచయం చేసుకోవడం
ఎవరు చేయాలి : ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మరియు 2-3 వాలంటీర్లు ఒక టీంగా చేయాలి. ప్రతి 10 ఇండ్లకు ఒకసారి ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరి. కావున వాలంటీర్స్ తో పాటు ఉద్యోగి కూడా ఫీల్డులో ఖచ్చితంగా తిరగాలి.
Citizen Outreach Campaign Dash Board and App Links
సిటిజన్ ఔట్రీచ్ రిపోర్ట్ (డాష్ బోర్డ్)
ఎప్పుడు చెయ్యాలి : నెలకు రెండు రోజులు అనగా నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు సర్వే చేయాలి.
సర్వే చేయు విధానం :
సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని సర్వే పూర్తి చెయ్యాలి.
ఏప్రిల్ 28, 29 తేదీల్లో GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) నిర్వహించబడును. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి :
Aadhar Service
గ్రామ వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల గురించి మీకు తెలుసా ?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి.
ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఆధార్ కార్డు లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలని మీకు తెలుసా ?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి
పిల్లలు 5 Yrs నిండిన తరువాత మరియు 15Yrs నిండిన తరువాత ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ / వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని మీకు తెలుసా ?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం 2300 గ్రామ వార్డు సచివాలయాలలో ఆధార్ కేంద్రాలను నెలకొల్పడం జరిగినది . వెంటనే మీ దగ్గరలోని ఆధార్ కేంద్రం ఉన్న సచివాలయానికి వెళ్ళి పైన తెలిపిన సేవలను ఉపయోగించుకోవలెను.
ప్రభుత్వ పధకాలు సక్రమంగా మీకు అందాలన్నా మరియు మీ బ్యాంక్ లావా దేవీలు సక్రమంగా జరగాలన్నా ఆధార్ డాక్యుమెంట్స్ ని తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవలెను .
ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. ” Data Saved Successfully” అనీ వచ్చినట్లయితే పూర్తి అయినట్టు.