AP GOVERNMENT SCHEMES
AP Government Schemes eligibility rules and Detailed SOPs and Scheme Posters Download Here.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పధకాల సమచారం తెలియజేయడం కోసం ఈ యొక్క పేజిని పబ్లిస్ చెస్తున్నాము.
For More VSWS Updates Click Here
Visit GSWS NBM Portal For More Updates
వైయస్సార్ జలకల :
- రైతులకు వ్యవసాయానికి నీరు అందించేందుకు ఉచిత బోర్వెల్స్ తవ్వకం. చిన్న సన్నకారు రైతులకు పంపుసెట్, విద్యుత్ కనెక్షన్ ఉచితం.
వైయస్సార్ ఆరోగ్య ఆసరా :
- వైయస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోజుకు రూ. 225 గరిష్టంగా నెలకు రూ. 5000 వరకు చెల్లింపు.
- డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా వర్తింపు.
- ప్రబుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్ధులందరికి స్కూలు బ్యాగు, మూడు జతల యూనిఫారం క్లాత్,బెల్ట్, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్ బుక్ ఇవ్వడం.
- ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించుకునేందుకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ.
ఇంగ్లీష్ మీడియం బోధన :
- అన్నీ ప్రబుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన. తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు.
- ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియా బోధన.
- సంవత్సరానికి ఒక తరగతి చొప్పున దశలవారీగా అన్నీ తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం అమలు.
వైయస్సార్ సంపూర్ణ పోషణ
- గర్బిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, మాతా శిశు మరణాల వంటి ఆరోగ్య సమస్యలు నివారించడమే లక్ష్యంగా వైయస్సార్ సంపూర్ణ పోషణ.
మనబడి నాడు నేడు
- ప్ర్కభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుల ప్రమాణాలు పెంచడం, మౌలిక వసతుల కల్పన.
- తాగునీరు,టాయిలెట్, ఫర్నిచర్, కాంఫౌండ్ వాల్, పెయింటింగ్, మరమ్మత్తులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, వంటగది, ఇంగ్లీష్ ల్యాబ్ వంటి సౌకర్యాల కల్పన.
- రాష్ట్రంలో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాల పునరుద్దరించి వాటిని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమూల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఏపీ అమూల్ పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం. ప్రతి లీటరు పాలపై మిగిలిన ప్రైవేట్ డెయిరీతో పోల్చితే సగటున రూ. 5 నుంచి రూ. 7 ల అదనపు ఆదాయం.
వైయస్సార్ ఉచిత పంటల బీమా:
- రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పంటలబీమాకోసం రైతన్నల తరపున ప్రీమియాన్ని కూడా పూర్తి గా చెల్లిస్తూ రైతుల పై పైసా కూడా ఆర్ధిక బారం లేకుండా చేస్తున్న ప్రభుత్వం.
- ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా రైతులంతా అర్హులే.
వైయస్సార్ 0 వడ్డీ పంట రుణాలు :
- రైతులకు సున్నవడ్డీ కే పంట రుణాలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ.
- కొత్తగా లా గ్రాడుయేషన్ పూర్తి చేసిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడెవరకు మొదటి మూడు సంవత్సరాల ప్రాక్టీస్ పీరియడ్ లో ప్రతి నెలా రూ. 5000 స్టైఫండ్
- వైయస్సార్ వాహన మిత్ర:
- డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో , ట్యాక్షీ , మ్యాక్షీ క్యాబ్ డ్రైవరు కమ్ ఒనర్లకు ఏటా రూ. 10,000 ఆర్ధిక సాయం.
కంటివెలుగు
- విద్యార్ధులకు అవ్వతాతలకు ఉచిత కంటి పరీక్షలు, ఉచితంగా కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ.
- అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు.
జగనన్న గోరుముద్ద
- వారంలో ప్రతిరోజూ ప్రత్యేక మెనూతో పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న బోజనం.
ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల మొత్తం సొమ్ము నాలుగు వాయిదాల్లో నేరుగా వారిచేతికే అందజేత.
జగనన్న అమ్మ ఒడి : పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15000. ఒకటి నుంచి ఇంటర్ వరకు అన్నీ ప్రభుత్వ , ప్రైవేట్ ,ఎయిడెడ్, రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్ధులకు ప్రయోజనం. 9-12 తరగతుల విద్యార్ధులు సొమ్ము లేదా ల్యాప్ టాప్ తీసుకునే వెసులుబాటు.
షాపులున్న నాయీ బ్రామ్హణులు. టైలర్లు , లాండ్రీ షాపులున్న రజకులకు ఏడాదికి రూ. 10,000 ఆర్ధిక సాయం.
రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పంటలబీమాకోసం రైతన్నల తరపున ప్రీమియాన్ని కూడా పూర్తి గా చెల్లిస్తూ రైతుల పై పైసా కూడా ఆర్ధిక బారం లేకుండా చేస్తున్న ప్రభుత్వం.ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా రైతులంతా అర్హులే.
దేశచరిత్రలో మొదటిసారిగా ఏ సీజన్లో జరిగీ పంట నస్టానికి ఆ సీజన్లోనే పరిహారం చెల్లింపు. రూ. 2,000 కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు.
జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన
దేశ చరిత్రలో తొలిసారిగా విద్యార్ధులకు పూర్తి ఫీజు రియంబర్సుమెంట్. ఐ టి ఐ నుంచి పీజీ వరకు చదివే విద్యార్ధులకు వసతి, బోజన ఖర్చులకు ఆర్ధిక సాయం. ఐ టి ఐ విద్యార్ధులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15,000, డిగ్రీ ఆ పై చదివే వారికి రూ. 20,000 సాయం.
45 నుంచి 60 ఏళ్ల మద్య వయసుగల కాపు , బలిజ,తెలగ , ఒంటరి కులాల పేద అక్క చెల్లెమ్మలకు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఏటా రూ. 15,000 చొప్పున ఆర్ధిక సాయం.
మత్స్యకార కుటుంబాలకు వేట నిషేదిత సమయంలో గతంలో రూ. 4000 గా ఉన్న ఆర్ధిక సాయం రూ. 10000 కు పెంపు.
డయాలసిస్, తలసేమియా , సికిల్ సెల్ , ఎనీమియా ,వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ. 10,000 పింఛన్. పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణతవల్ల మంచానికే పరిమితమైన వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 5,000 పెన్షన్. వికలాంగులకు 3000 పింఛన్. వృద్దాప్య పింఛన్ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. పెన్షన్ 1000 నుంచి 2250 కి దశల వారీగా 3000 వరకు పెంపు.
ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 13500 పెట్టుబడి సాయం. 5 ఏళ్లలో మొత్తం సాయం రూ. 67500. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు, అటవీ దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు రైతు భరోసా వర్తింపు.
వార్సిక ఆదాయం ఋ. 5 లక్షల లోపు ఉన్నఅన్నీ వర్గాల వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు. వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిపు. ఎన్ని లక్షలు ఖర్చు ఐనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచిత వైద్యం. 1000 వరకు ఉన్న వ్యాధులు ఆపరేషన్ల పరిధి 2434 కి పెంపు. చెన్నై, బ్యాంగులూర్, హైద్రాబాద్ నగరాల్లోను ఆరోగ్య శ్రీ సేవలు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సాయంగా భీమా.గతంలో ఉన్నట్టుగా ప్రతి పాలసీకీ కేంద్ర ప్రబుత్వమ్ ఇచ్చే వాటా లేనప్పటికి దేశంలో ఎక్కడా లేనివిదంగా పూర్తి ఖర్చు భరిస్తున్న రాష్ట్రప్రబుత్వం .సహజ మరణానికి 2 లక్షలు , ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగవైకల్యానికి 3 నుంచి 5 లక్షలు. పాక్షిక అంగవైకల్యానికి 1.5 లక్షలు చెల్లింపు.
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసుగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్క చెల్లెమ్మలకు ఏటా రూ. 18750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75000 ఆర్ధిక సాయం. ఈ డబ్బును వారి జీవనోపాది కార్యక్రమాలకు, చిన్న , మధ్య తరహా వ్యాపారాలకు వాడుకోవచ్చు. రిటైల్ రంగంలో మహిళల ఆర్ధిక స్వావలంబనకు , వ్యాపారాల అబివృద్దికి ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలైన అమూల్, ఐటీసీ , రిలయన్స్ వంటి వాటితో ఒపందాలు . అక్క చెల్లెమ్మలకు మార్కెటింగ్ నైపుణ్యాలతో శిక్షణ.
నిరుపేద చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారి పెట్టుబడి అవసరాలు తీర్చేందుకు బ్యాంకుల ద్వారా ప్రబుత్వమే వడ్డీ కడుతూ సున్నా వడ్డీ రుణాలు. చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున బ్యాంకుల ద్వారా రుణం.