వై ఎస్ ఆర్ బీమా
- పథకంయొక్కవివరం:
సహజంగాలేదాప్రమాదవశాత్తుమరణించినపుడులేదాప్రమాదంకారణంగాశాశ్వతవైకల్యంసంభవించినప్పుడుఅసంఘటితకార్మికులకుటుంబాలకుఆర్థికఉపశమనంఅందించడానికిభారతప్రభుత్వంఅమలుచేస్తున్నబీమాపథకంఇది.
GV/WV & VS/WS క్లెయిమ్యొక్కస్వభావాన్నిమూడువిధాలుగాగుర్తిస్తుంది:
- సహజమరణం (క్లెయిమ్మొత్తంరూ. 1.00 లక్షలు, 18-50 సంవత్సరాలవయస్సు)
- ప్రమాదమరణం (క్లెయిమ్మొత్తంరూ. 5.00 లక్షలు, వయస్సు 18-70 సంవత్సరాలు)
- ప్రమాదంకారణంగాశాశ్వతవైకల్యం (క్లెయిమ్మొత్తంరూ. 5.00 లక్షలు, వయస్సు 18-70 సంవత్సరాలు)
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ మరియు విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
ప్రమాణం | నిబంధనలు |
మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. |
మొత్తం కుటుంబానికిగల భూమి | లబ్ధిదారులు 10 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 25 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 25 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. |
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
వయస్సు& లింగం | • రాష్ట్రంలోని 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల అసంఘటిత కార్మికులందరూ. • ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల వయస్సు తీసుకోబడుతుంది. |
పథకానికి నామినీ | ఈ పథకం క్రింద లబ్ధిదారుని భార్య/ భర్త18 ఏళ్లపైబడిన కుమారుడు/కుమార్తెపెళ్లికాని కూతురువితంతువు కూతురుఆధారపడిన తల్లిదండ్రులువితంతువు కోడలు లేదా ఆమె పిల్లలు నామినీగా ఉండాలి. |
అదనపు షరతులు | YSR బీమా పథకం యొక్క లబ్ధిదారులుగా నమోదు చేసుకోవడానికి రాష్ట్రంలోని బియ్యం కార్డు కుటుంబాలలో 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు/ యజమానులు (సంపాదనాపరుడు/సంపాదనాపరురాలు) అర్హులు.ఈ పథకం కింద కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే ప్రాధమిక సంపాదనాపరుడు/సంపాదనాపరురాలుగా గుర్తించబడతారు.ఒక కుటుంబంలోని సంపాదనాపరుడు/ సంపాదనాపరురాలుగా ఆ కుటుంబంలోని వ్యక్తులే గుర్తించాలి. .లబ్ధిదారు BPL కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. |
వైకల్యంకోసం | సదరం /మెడికల్సర్టిఫికేట్డాక్టర్సర్టిఫికేట్యొక్కసంబంధితశాతం |
వై ఎస్ ఆర్ బీమా పథకానికి చెక్ లిస్ట్ | • కుటుంబంలోని సంపాదనాపరుడు/ సంపాదనాపరురాలి పేరు • లింగం, వయస్సు, చిరునామా • బియ్యం కార్డ్ నంబర్ • నామినీ పేరు • నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు,IFSC కోడ్, బ్యాంకు శాఖ పేరు • మరణించిన లేదా అంగ వైకల్యం పొందిన వ్యక్తితో నామినీకి గల సంబంధం • పథకం కోసం అవసరమైన ఏదైనా ఇతర సమాచారం, రిమార్కులు |
- A) పథకం అమలు విధానం (సహజ మరణం)
B) పథకం అమలు విధానం (ప్రమాదవశాత్తు మరణం)
C) పథకం అమలు విధానం (ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం)
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- మున్సిపల్ కమీషనర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ బీమా పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 07, తేదీ: 27.06.2021 |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు:
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
1. | 11.06.2022 | వై ఎస్ ఆర్ బీమా పథకం జి.ఓ.ఎం. ఎస్. నెం. 23 |
#సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెం: 1902
మరింత సమాచారం కొరకుhttps://ysrbima.ap.gov.in/అనే వెబ్ సైట్ను చూడవచ్చు.