డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
ఈ పథకం లక్ష్యం
స్వీయ-నిధుల రీయింబర్స్‌మెంట్ మెకానిజం (ట్రస్ట్) ద్వారా గుర్తించబడిన నెట్ వర్క్ఆసుపత్రులనుండి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత,నాణ్యమైన వైద్య సేవలు అందించడం.
ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవరేజ్
విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య ఖర్చులకు అవసరమైన ఆర్థిక భద్రతను అందించడం.
డిమాండ్ సైడ్ ఫినాన్సింగ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం.
పట్టణ మరియు గ్రామీణ పేదల ఆరోగ్యానికి సంబంధించిన సార్వత్రిక కవరేజ్ని అందించడం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
- గ్రామీణ ప్రాంతాలు: సహాయక నర్సు (ANM)
- పట్టణ ప్రాంతాలు: వార్డు ఆరోగ్య కార్యదర్శి (WHS)
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
ప్రమాణం | నిబంధనలు |
వ్యక్తిగత వాహనం | ఒకటికి మించి వ్యక్తిగత వాహనం (కారు) లేని కుటుంబాలు. |
మొత్తం కుటుంబ ఆదాయం | రూ.5.00 లక్షలు లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలు (సాలరీ సర్టిఫికేట్ ప్రకారం) |
కుటుంబానికి గల మొత్తం భూమి | 12.00 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 35.00 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా35 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. |
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) క్రిందకు వస్తారు కాబట్టీ వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించదు. |
ఆదాయపు పన్ను | రూ. 5.00లక్షల రూపాయల ఆదాయం వరకూ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అర్హులు (ఆదాయపు పన్ను ధృవపత్రం అవసరం) |
మున్సిపాలిటీ ఆస్తి | పట్టణ ప్రాంతాలలో 3000 చ.అల స్థలం (334చ.గ.) కంటే తక్కువ కలిగి ఉండి మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్న అన్ని కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
- పథకం అమలు విధానం
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ. నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి. ఓ.ఎం.ఎస్. నెం. 227, తేదీ: 09.06.2006 &జి. ఓ.ఎం.ఎస్. నెం. 83, తేదీ: 21.08.2020 |
2. | డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం | https://www.ysraarogyasri.ap.gov.in/web/guest/ysr-aarogyasri-scheme |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
- ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన సేవా కేంద్రం నెంబరు: 104
- ఈ మెయిల్: ap_grievance@ysraarogyasri.ap.gov.inకు మెయిల్ చేయవచ్చు.
- మెడికల్ రీయింబర్స్మెంట్ అంశాలు మరియు స్థితి కోసం +91-8333817363 కు కాల్ చేయవచ్చు లేదా ap_mr@ysraarogyasri.ap.gov.inకు మెయిల్ చేయవచ్చు.
1 Comment
Add a Comment