వాహన మిత్ర
- పథకం యొక్క వివరం:
ఆటో, టాక్సీ మరియు మాక్సీ డ్రైవర్/ యజమానులకు వార్షిక నిర్వహణ ఖర్చులు మరియు బీమా మరియు ఫిట్ నెస్ సర్టిఫికేట్ వంటివి పొందడానికి సంవత్సరానికి రూ. 10,000/-లు ఆర్ధిక సహాయం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్యఉద్దేశ్యం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. | |
వాహనం | దరఖాస్తుదారు “స్వంత వాహనం” అనగా ఆటో రిక్షా/టాక్సీ/మాక్సీ క్యాబ్ కలిగి ఉండి వాటిని “నడపటం” తో పాటు వాహనం యజమాని ఆధీనంలో ఉండాలి. | |
కావలసిన ధృవపత్రాలు | ఆధార్ కార్డుBPL/తెలుపు రేషన్ కార్డు/ అన్నపూర్ణ కార్డు/ అంత్యోదయకార్డుఆటో రిక్షా/ లైట్ మోటార్ వెహికల్ నడుపుటకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సువాహన యజమాని పేరున క్రియాశీలకంగా ఉన్న బ్యాంకు ఖాతాఒకే తెల్ల రేషన్ కార్డులో వేర్వేరు వ్యక్తులపై యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. అయితే, ఒకే తెల్ల రేషన్ కార్డులో భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సహాయానికి అర్హులు. | |
ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు | |
పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) | |
మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు | |
విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
- పథకం అమలు విధానం

- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- మున్సిపల్ కమీషనర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ వాహన మిత్ర పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 26, తేదీ: 01.06.2021 |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
వై ఎస్ ఆర్ వాహన మిత్ర పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 34, తేదీ: 09.09.2019 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) సాంకేతిక సమస్యలు/ సహాయం కొరకు https://navasakam2.apfss.inఅనే వెబ్ సైట్ను సందర్శించవచ్చు.