వైఎస్ఆర్ రైతు భరోసా
- పథకం యొక్క వివరం :
భూయజమానులకుసంవత్సరానికిరూ” 13500 (రూ” 6000 PM కిసాన్) లబ్దితోకలిపి 3 విడతాలలోచెల్లిస్తారు.
పంటసాగుదారులహక్కుపత్రం (CCRC) కలిగినరైతులకురాష్ట్రప్రభుత్వంసంవత్సరానికిరూ. 13,500/-లు 3 విడతలలోచెల్లిస్తారు. ఈ పథకంక్రింద లబ్ధిదారులకు అందించేఆర్ధిక సహాయంప్రతి సంవత్సరం మూడు విడతలుగా అంటే మే, అక్టోబర్&జనవరి నెలల్లో అందిస్తారు. భూమిలేని SC, ST, BC, మరియు మైనారిటీ వర్గాల కౌలు రైతులు మరియు అటవీ భూమి సాగుదారుల రైతుల ఆదాయాన్నిఅభివృద్ధి చేసేవిధంగా మరియు పంట కాలంలోరైతులకు పెట్టుబడినిఅందించడం ఈ పథకంయొక్కలక్ష్యం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి(క్షేత్ర స్థాయి):
- గ్రామ వ్యవసాయ సహాయకులు/ గ్రామ ఉద్యానవన సహాయకులు/ గ్రామ సెరి కల్చర్ సహాయకులు
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందే లబ్ధిదారులు ఈ దిగువ తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
ప్రమాణం | నిబంధనలు |
పౌరసత్వం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శాశ్వత నివాసి అయి ఉండాలి |
మొత్తం కుటుంబానికి గల భూమి | భూమి లేని/ కౌలు రైతుల అర్హతలు: కౌలు రైతు / కుటుంబ సభ్యులకు స్వంత వ్యవసాయ భూమి ఉండరాదు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య కౌలు అగ్రిమెంటు ఉన్నట్లైతే వారికి ఆర్ధిక సహాయం అందించబడదు. |
మొత్తం కుటుంబానికి గల భూమి | భూమి లేని ఒక్కో రైతు కౌలుకు తీసుకోదగిన భూమి వివరాలు: వ. నెం. పంట వివరం కౌలుకు తీసుకోదగిన భూమి (ఎకరాలలో) 1. అన్ని వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల పంటలు ఎ. 1.0 (0.4 హె) 2. కూరగాయలు, పువ్వులు మరియు పశుగ్రాస పంటలు ఎ. 0.5 (0.2 హె) 3. తమలపాకు పంట ఎ. 1.0 (0.4 హె) వ్యవసాయ భూమి కలిగిన రైతుల అర్హతలు: వ్యవసాయ భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా, మినహాయింపు ఇవ్వబడిన రైతుల కేటగిరీలోకి రానివారందరికీ.అటవి భూమి సాగుదారులుమరియు D పట్టా భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలుఒకవేళ భూమి జాయింటుగా ఉన్న సందర్భంలో ఎక్కువ శాతం భూమి కలిగిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఆర్ధిక సహాయం మొత్తం బదిలీ చేయబడుతుంది. ఒకవేళ కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల పేరు మీద గల భూమి ఒకే పరిమాణంలో ఉంటే వారిలో పెద్దవారి యొక్క బ్యాంకు ఖాతాలోకి ఆర్ధిక సహాయం మొత్తం బదిలీ చేయబడుతుంది. |
ప్రభుత్వ ఉద్యోగి | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. |
ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
ప్రత్యేక అనర్హతలు | రాజ్యాంగం నిర్దేశించిన పోస్టులలో బాధ్యతలు నిర్వహించిన వారు/ నిర్వహిస్తున్న వారుఅంటే కేంద్ర, రాష్ట్ర మాజీ మరియు ప్రస్తుత మంత్రులు మరియు లోక్ సభ/ రాజ్య సభ/ శాసన సభ/ శాసన మండలి యొక్క మాజీ మరియు ప్రస్తుత సభ్యులు మినహా ఇతర ప్రజాప్రతినిధులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందటానికి అర్హులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ/ PSUs/ స్వయం ప్రతిపత్తిగల సంస్థల ఉద్యోగులు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు (మల్టీ టాస్కింగ్ సిబ్బంది/ క్లాస్-IV / గ్రూప్ D ఉద్యోగులు మినహా)రూ. 10,000/-లు లేదా అంతా కంటే ఎక్కువ నెలవారీ పింఛను పొందుతున్న ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తులు (మల్టీ టాస్కింగ్ సిబ్బంది/ క్లాస్-IV / గ్రూప్ D ఉద్యోగులు మినహా)గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారందరూవృత్తిపరమైన సంస్థలలో రిజిస్టర్ చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్ వృత్తిలో ఉండీ ప్రాక్టీసు చేస్తున్నవారువ్యవసాయ భూమిని కలిగి ఉండి ఇండ్ల స్థలాల క్రింద మార్పు చేసుకున్నవారు (రెవెన్యూ రికార్డులలో నమోదైన, నమోదు కానీ ఆక్వా కల్చర్ సాగు చేస్తున్న రైతులు)గత అసెస్మెంట్ సంవత్సరంలో కమర్షియల్ టాక్స్/ ప్రొఫెషన్ టాక్స్/ GST చెల్లించినవారు. |
- పథకం యొక్క పని విధానం
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- మండల వ్యవసాయ అధికారి
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ రైతు భరోసా పథకం – ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 96, తేదీ: 19-09-2019 |
2. | వై ఎస్ ఆర్ రైతు భరోసా పథకం – ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 113, తేదీ: 26-11-2019 |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ చరిత్ర
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
జి.ఓ.ఎం.ఎస్.నెం. 113 | 26-11-19 | వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలకు భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. 12,500/-లకు బదులుగా రూ. 13,500/-లు చెల్లిస్తారు. “YSR రైతు భరోసా” కింద ప్రయోజనం కోసం (మాజీ) &ప్రస్తుత మంత్రులు, MPలు, MLAS & MLCSగా నియోజకవర్గ పదవిని కలిగి ఉన్న రైతులు మరియు వారి కుటుంబ సభ్యులు మినహాయించబడ్డారు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరూ ఈ పథకం కింద అర్హులు.ఒక రైతు యొక్క పెళ్లికాని పిల్లలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను మదింపుదారు అయినట్లయితే, అతను లేదా ఆమె ఏ మినహాయింపు కేటగిరీ కిందకు రానట్లయితే, ఆ రైతు ఈ పథకం కింద అనర్హులను చేయదు.మరణ కేసుల విషయంలో, మరణించిన వ్యక్తి యొక్క జీవిత భాగస్వామికి ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. అయితే, వెబ్ ల్యాండ్‌లో జరిగిన మ్యుటేషన్‌ల ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సహాయం చట్టపరమైన వారసుడికే అందుతుంది. |
# ఫిర్యాదులుమరియుసమస్యలకోసంసంప్రదించండి
పౌరులుఫిర్యాదులకోసంటోల్ఫ్రీనెంబర్- 1902నుసంప్రదించవచ్చు (లేదా) www.navasakam2.apfss.in నిసందర్శించవచ్చు