వై ఎస్ ఆర్ చేయూత
- పథకం యొక్క వివరం:
మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించటానికి వీలుగా 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి BC,SC,ST మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి రు” 18,750 నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 75,000/-ల ఆర్ధిక సహాయం నాలుగు విడతలుగా అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలను, కుటుంబ స్థాయిలో ఆదాయ పెంపుదలను, సంపద సృష్టిని కల్పించడం ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
- సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
- వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి (పట్టణ ప్రాంతాలు)
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
ప్రమాణం | నిబంధనలు |
మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. |
మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు |
ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్కవిద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
పట్టణాల్లో ఆస్తి | మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం (నివాస లేదా వాణిజ్య)ఉన్నవారు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
వయస్సు & లింగం | పధకం ప్రారంభం నాటికి 45 నుండీ 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు. |
పుట్టిన తేదీ ఆధారం | ఆధార్కార్డ్ప్రకారం |
కుల ధృవీకరణ పత్రం మరియు బ్యాంకు ఖాతా వివరాలు | లబ్ధిదారులు చెల్లుబాటయ్యే కుల ధృవీకరణ పత్రాన్ని మరియు ఆర్ధిక సహాయాన్ని జమ చేసేందుకు ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో తమ పేరుపై తెరచిన ఖాతా వివరాలను ఇవ్వాలి. |
- పథకం అమలు విధానం
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- మున్సిపల్ కమీషనర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ చేయూత పథకం – అమలు మార్గదర్శకాలు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 636, తేదీ: 12-06-2020 |
2. | వై ఎస్ ఆర్ చేయూత పథకం – మార్గదర్శకాలు/ పథకం అమలుకు పని విధానం (వర్క్ ఫ్లో) | మెమో నెం. 1168432/ ఆర్‌డి.1/A1/2020 |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
1 | 11-08-2020 | జి.ఓ.ఎం.ఎస్.నెం 648,PR&RD |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబరు:1902
ఫిర్యాదులను www.navasakam2.apfss.in అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు.