రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
- పథకంయొక్కవివరం: భారీ వర్షాలు, కరువు, తుఫాన్లు, వరదలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 33%మరియు అంతకన్న ఎక్కువపంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. రైతు భరోసా కేంద్రాల (RBK) వద్ద e-క్రాపింగ్ ఆధారంగా శాస్త్రీయ విధానంలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.
2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి
3.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద
తేలిపినఅర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | అనుమతించబడే పంటలు | వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది పప్పు, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, రాగి, శనగ, రాజ్మా, నువ్వులు, అలసందలు, బొబ్బర్లు మొదలైనవి. |
2 | అనుమతించబడే రైతులు | కౌలు రైతులు మరియు రైతుల (భూ యజమానులు)తో సహా సన్న/చిన్న/పెద్ద అనే తేడా లేకుండా రైతులందరూ. |
3 | ప్రీమియం | రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. |
4. పథకం యొక్క పని విధానం
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండల వ్యవసాయ అధికారి (MAO)
6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పథకం | జి.ఓ.ఎం.ఎస్.నెం. 15, తేదీ: 04-12-2015 |
2. | రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పథకం | జి.ఓ.ఎం.ఎస్.నెం.23-12-2014 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1907 లేదా 1902 లేదా 1800-180-1551.