ఈబిసి నేస్తం
- పథకానికి సంబంధించిన వివరాలు:
ఆర్థికంగావెనుకబడినఅగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు తగిన సహకారం అందించడమే ఈబీసీ నేస్తం పథకం లక్ష్యం. లబ్ధిదారులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వైయస్సార్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు.
2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి
3. అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
2 | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
3 | ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
4 | పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అ.ల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
5 | లబ్ధిదారుకలిగి ఉండవల్సిన భూమి | 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు |
6 | విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
7 | వయస్సు/ లింగం | 45-60 సంవత్సరాల మహిళలు, పుట్టిన తేదీ ఆధారంగా: ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ (క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్)జననధృవీకరణపత్రం / 10 వ తరగతి మార్కుల పట్టికఆధార్ కార్డు |
4. పథకం అమలు విధానం:
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండల పరిషత్ అభివృద్ధి అధికారి
మున్సిపల్ కమీషనర్
6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | EBC నేస్తం పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 2, తేదీ: 20.04.2021 |
7. ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
1. | 28.12.2021 | జి.ఓ.ఎం.ఎస్.నెం. 20 |
సాంకేతిక సహాయం కోసం…
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) సాంకేతిక సహాయం కొరకు ఈ మెయిల్:support@progment.comకు మెయిల్ చేయవచ్చు(లేదా)https://navasakam.ap.gov.inఅనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.