జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన
1. పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవిద్యాదీవెనRTF):
జగనన్న విద్యా దీవెన పథకంలో ITI నుండి Ph.D. వరకు (ఇంటర్మీడియట్ మినహా) చదువుకుంటున్న SC,ST,BC,EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగులైన విద్యార్ధులలో అర్హులైన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడమేలక్ష్యం.
2.పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవసతిదీవెనMTF):
జగనన్నవసతిదీవెనపథకంలో ITI విద్యార్థులుఒక్కొక్కరికిరూ.10,000/-, పాలిటెక్నిక్విద్యార్థులకుఒక్కొక్కరికిరూ.15,000/-, ఇతరడిగ్రీమరియుఅంతకంటేఎక్కువకోర్సులకుఒక్కొక్కరికిరూ.20,000/-. అర్హతఉన్నప్రతివిద్యార్థికిసంవత్సరానికిఆహారంమరియుహాస్టల్ఖర్చులుఅందిచడమేప్రథమలక్ష్యం.
3.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
- సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
- వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (పట్టణ ప్రాంతాలు)
4.అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | నివాసం | ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోశాశ్వత నివాసిగా ఉండాలి. |
2 | మొత్తం కుటుంబ ఆదాయం | మొత్తం కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు అర్హులు. |
3 | మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు 10 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 25 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 25 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. |
4 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
5 | కోర్సు పూర్తి | కాలేజీలు/ యూనివర్సిటీలు లేదా గుర్తించబడిన విద్యా సంస్థలలో విద్యార్ధులు రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం పొంది ఉండాలి. |
6 | అర్హత గల కోర్సులు | బి.టెక్ బి. ఫార్మసీ ఐటిఐ పాలిటెక్నిక్ బి. ఎడ్ యం.టెక్ యం. ఫార్మసీ యంబిఎ ఇతర డిగ్రీలు/పోస్టుగ్రాడ్యుయేట్స్ * పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ/ యూనివర్సిటీ కాలేజీలలో చదివే వారు మాత్రమే అర్హులు |
7 | అర్హత గల విద్యా సంస్థలు | ఈ క్రింద తెల్పిన విద్యా సంస్థలలో ప్రవేశం పొందినవారు అర్హులు: ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్)రాష్ట్ర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కాలేజీలు/ బోర్డులు. డే స్కాలర్ విద్యార్ధులు, కాలేజీలకు అనుసంధానించబడిన హాస్టల్విద్యార్ధులు (CAH), మరియు సంబంధిత శాఖకు అనుసంధానించ బడిన హాస్టల్ విద్యార్ధులు (DAH). |
8 | హాజరు | లబ్ధిదారులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి |
9 | అవసరమైన ధృవపత్రాల జాబితా | ఆధార్ కార్డురైస్ కార్డు/ ఆదాయ ధృవపత్రంకాలేజీ ప్రవేశ వివరాలుతల్లిదండ్రుల వివరాలుకుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు కారనే ధృవపత్రం/ నాలుగు చక్రాల వాహనం లేదనే ధృవపత్రం/ 1500 చ. అడుగుల పైన పట్టణ ప్రాంతంలో ఆస్తి లేదనే ధృవపత్రం/ నిర్ణీత పరిమితికి మించిన వ్యవసాయ భూమి లేదనే ధృవపత్రం |
10 | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
11 | పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1500 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
12 | ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
13. | వయస్సు& లింగం | బాల, బాలికలు ఇద్దరూ అర్హులే,అర్హత గల నిర్ణీత కోర్సుకు తగిన వయస్సుకలిగి ఉండాలి. |
14. | కులం & కేటగిరీ | ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఇబిసి (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్ధులు అర్హులు. |
15. | అనర్హతలు | ప్రైవేటు యూనివర్సిటీలు/ డీమ్డ్ యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్ధులు (ప్రభుత్వ కోటా మినహా).కరెస్పాండెన్స్ కోర్సు విధానంలోనూ, దూర విద్యా విధానంలోనూ చదువుతున్న విద్యార్ధులు.మేనేజిమెంట్ / NRI కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్ధులకు ఈ పథకం వర్తించదు. |
5. పథకం అమలు విధానం:
6.తక్షణ అప్పీలేట్ అథారిటీ:
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- మున్సిపల్ కమీషనర్
7.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | జగనన్న విద్యా & వసతిదీవెన పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 115, తేదీ: 30-11-2019 |
8.ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
1. | 29-11-2021 | జగనన్న విద్యా & వసతిదీవెన పథకం జి.ఓ.ఎం.ఎస్.నెం. 35, |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెం:1902
ఫిర్యాదులను jnanabhumi.jvdschemes@gmail.com అనే ఈ మెయిల్ అడ్రస్ కు పంపవచ్చు.
మరింత సమాచారం కొరకు https://navasakam.ap.gov.in/అనే వెబ్ సైట్ను చూడవచ్చు.
1 Comment
Add a Comment