జగనన్న చేదోడు
- పథకానికి సంబంధించిన వివరాలు:
ఇది రాష్ట్రంలోని టైలర్లు (అన్ని కమ్యూనిటీలు), రజకులు (వాషర్‌మెన్‌లు) మరియు నాయీ బ్రాహ్మణుల (బార్బర్‌లు) కోసం మొదలు పెట్టిన పథకం ఇది. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. మొత్తం సొమ్మును ఐదు వాయిదాలలో (రూ.50,000/-) చెల్లిస్తారు. లబ్ధిదారులు తమ ఆదాయ వనరులు మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధనాలు, పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది.
2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి
3. అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | వృత్తి | రాష్ట్రంలోని రజకులు/ ధోబీలు (వాషర్ మెన్ – చాకలివారు)స్వంత సెలూన్ కలిగిన మంగలి వారు (నాయీ బ్రాహ్మలు – బార్బర్లు)కాపు,వెనుకబడినతరగతులు (BC),ఆర్ధికంగావెనుకబడినతరగతులకుచెందినదర్జీలు(టైలర్లు)(అన్ని కమ్యూనిటీలు), ఈ పధకం ఆశించే లబ్ధిదారులకు తప్పనిసరిగావారి షాపులు -షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్క్రింద రిజిస్టర్ చేయబడి ఉండాలి. |
2 | మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. |
3 | మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు |
4 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు మినహాయించబడినవి. |
5 | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
6 | విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్కవిద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు |
7 | ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
8 | పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
9 | పుట్టిన తేదీ ఆధారం | సమీకృత ధృవీకరణపత్రం (కులము, జనన తేదీ మరియు స్థానికత కలిగియున్నది)ఆధార్ కార్డ్ ప్రకారం |
10 | కుల ధృవీకరణ పత్రం & బ్యాంకు ఖాతా వివరాలు | లబ్ధిదారులు చెల్లుబాటయ్యే కుల ధృవీకరణ పత్రాన్ని మరియు ఆర్ధిక సహాయాన్ని జమ చేసేందుకు ఏదైనా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో తమ పేరుపై ఉన్న ఖాతా, ఆధార్ మరియు NPCIఖాతా వివరాలను ఇవ్వాలి. |
4. పథకం అమలు విధానం:
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండల పరిషత్ అభివృద్ధి అధికారి
మున్సిపల్ కమీషనర్
6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | జగనన్న చేదోడు ప్రభుత్వ ఉత్తర్వులు | మెమో నెం. 2030/BCW/c/2021తేదీ. 24.09.2021 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) https://navasakam2.apfss.in అనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
1 Comment
Add a Comment