జగనన్న తోడు
- పథకానికి సంబంధించిన వివరాలు:
వీధి వ్యాపారులకు ఒక్కో వ్యక్తికి రూ. 10,000/-లు చొప్పున సున్నా శాతం వడ్డీకి ప్రభుత్వం అందించే రుణ సహాయం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శులు.
- అర్హత ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
ప్రమాణం | నిబంధనలు |
మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,20,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – సంవత్సరానికిరూ. 1,44,000/-లలోపు ఉండాలి. |
మొత్తం కుటుంబానికి గల భూమి | 3ఏకరాలు కంటే తక్కువ మాగాణిలేదా 10ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా10ఏకరాలులోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు |
దుకాణం యొక్క రకం | 5.5 చదరపు అడుగుల కంటే పెద్దదిగా కట్టిన షాపును కలిగి ఉండకూడదు. |
వయస్సు& లింగం | 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలు మరియు పురుషులు |
అర్హత కలిగిన వీధి వ్యాపారులు | ఫుట్ పాత్ లపై అమ్ముకునే చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు మరియు రోడ్ల ప్రక్కన టిఫిన్ మరియు ఆహార పదార్ధాలను అమ్మేవారు, సాంప్రదాయక చేతికళలైన లేసు పని, కలంకారీ పనిఏటికొప్పాక మరియు కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణతోలు బొమ్మలు, కుమ్మరి, ఇత్తడి వస్తువులను మొదలైన వాటిని తయారుచేసేవారు. |
- పథకం అమలు విధానం:
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండలపరిషత్అభివృద్ధిఅధికారి/మునిసిపల్ కమీషనర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | జగనన్న తోడు పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 1, తేదీ: 29.05.2020 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:, 9505394510 (లేదా) ఈ మెయిల్: support@progment.comకు మెయిల్ చేయవచ్చు(లేదా) GSWS NBM అనే వెబ్ సైట్ను సందర్శించవచ్చు.