- పథకానికి సంబంధించిన వివరాలు:
స్వంతచేనేతమగ్గంకలిగిఉండిదానినిఆధునీకరించడంద్వారామరమగ్గాలకుధీటుగాపనిచేయడానికిప్రతిచేనేతకుటుంబానికిసంవత్సరానికిరూ.24,000/- లుఆర్ధికసహాయంచేయడమేఈపధకంయొక్కలక్ష్యం.
2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి
3. అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | అర్హతలు | దరఖాస్తుదారుడుస్వంతచేనేతమగ్గంకలిగిఉండిచేనేతవృత్తినికొనసాగిస్తూచేనేతవృత్తిపైననేజీవనోపాధినిపొందుచుండవలెను. ఒకచేనేతకుటుంబంలోఎన్నిమగ్గాలుఉన్నప్పటికీఒకలబ్దిమాత్రమేఅందించబడుతుంది. |
2 | మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపు ఉండాలిపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. |
3 | మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు – ఎ. 3.00ల కంటే తక్కువ మాగాణి లేదా ఎ. 10.00ల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా ఎ. 10.00లు లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు |
4 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు మినహాయించబడినవి. |
s | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
6 | విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలోకుటుంబంయొక్కవిద్యుత్తువినియోగంనెలకుసరాసరి 300 యూనిట్లుమించరాదు. |
7 | ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
8 | పట్టణాల్లో ఆస్తి | ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు(పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
9 | ప్రత్యేక అనర్హతలు | ఒక చేనేత కుటుంబానికి ఎన్ని మగ్గాలు కలిగి ఉన్నప్పటికీ ఒక లబ్ధి మాత్రమే వారికి అందించబడుతుంది. |
4. పథకం అమలువిధానం:
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండల పరిషత్ అభివృద్ధి అధికారి
మున్సిపల్ కమీషనర్
6.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 89, తేదీ: 23.10.2019 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1902, (లేదా) https://navasakam2.apfss.inఅనే వెబ్ సైట్ను సందర్శించవచ్చు.