వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా
- పథకానికి సంబంధించిన వివరాలు: వేట నిషేధ కాలంలో లేదా సముద్రంలో వేట నిషేధించిన కాలంలో అంటే ఏప్రిల్ 15 నుండీ జూన్ 14 వరకు (మొత్తం 61 రోజులు) (రెండు కాలాలు కలిపి) మత్స్యకార కుటుంబాలకు వారి జీవనోపాధిని పొందటానికి వీలుగా రూ. 10,000/-లు ఆర్ధిక సహాయం అందించటం ఈ పథకం యొక్క లక్ష్యం.
2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
ఫిషరీస్ అసిస్టెంట్
3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద
తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,20,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,44,000/-ల లోపు ఉండాలి. |
2 | మొత్తం కుటుంబానికి గల భూమి | లబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు |
3 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
4 | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
5 | విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్కవిద్యుత్తు వినియోగంనెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
6 | ఆదాయపు పన్ను | కుటుంబంనందుఎవరినాఆదాయపు పన్ను చెల్లిస్తున్నయడల ఈ పథకానికి అనర్హులు |
7 | పట్టణాల్లో ఆస్తి | మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం (నివాస లేదా వాణిజ్య)ఉన్నవారు (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
వయస్సు | 18 నుండీ 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు. | |
8 | పుట్టిన తేదీ ఆధారం | ఓటరు గుర్తింపు కార్డు 10వ తరగతి సర్టిఫికెట్ |
9 | ఆర్ధిక సహాయం కోసం అనుమతించ బడే బోట్లు/ పడవలు | అత్యధికంగా 10 మంది వ్యక్తులు పట్టే 18 మీటర్ల కన్నతక్కువ ఓఏఎల్ కలిగిన యాంత్రిక(మెకనైజ్డ్) బోట్లు (బోటు యజమాని మినహా) అత్యధికంగా 8 మంది వ్యక్తులు పట్టే 10 మీటర్ల పైన ఓఏఎల్ కలిగిన యాంత్రిక(మెకనైజ్డ్) బోట్లు (బోటు యజమాని మినహా)మోటారు బోటు – బోటు యజమానితో సహా 6 గురు వ్యక్తులు పట్టే సామర్ధ్యం గల బోటుమోటారు లేనిసంప్రదాయ బోటు – బోటు యజమానితో సహా 3 గురు వ్యక్తులు పట్టే సామర్ధ్యం గల బోటు |
10 | అధిక వేగాన్నిచ్చే డీజిల్ (HSD) ఆయిల్ వినియోగం | యాంత్రిక బోట్లు – సంవత్సరంలోకనీసం 1000 లీటర్ల HSD ఆయిల్ ను మోటారు బోట్లు – సంవత్సరంలో కనీసం 100 లీటర్ల HSD ఆయిల్ ను ఉపయోగించాలి. |
11 | ప్రత్యేక అనర్హతలు లేదా మినహాయింపులు | ఆర్ధిక సహాయాన్ని పొందటానికి గత ఆర్ధిక సంవత్సరంలో APMFR చట్టం క్రింద జరిమానా విధించబడిన చేపల వేటల బోట్లుప్రభుత్వ ఇతర పథకాలైన అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్రా, కాపు నేస్తం, పాస్టర్లు, వైఎస్ఆర్ చేయూత,నేతన్న నేస్తం మరియు ఇతర ఫించన్లు పొందే లబ్ధిదారులు ఈ ఆర్ధిక సహాయాన్ని పొందటానికి అనర్హులు. ఒక కుటుంబాన్ని యూనిట్ గా పరిగణించి, ఒక్కో కుటుంబానికి ఒక ప్రయోజనం మాత్రమే అందించబడుతుంది. |
12 | అవసరమైన పత్రాలు | బోట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఫిషింగ్ లైసెన్స్ కాపీ (పడవ యజమాని)మొత్తం సిబ్బంది యొక్క ఆధార్ కార్డ్ కాపీసిబ్బంది అందరి బియ్యం కార్డుసిబ్బంది అందరి బ్యాంక్ ఖాతా వివరాలు (పాస్ పుస్తకం 1వ పేజీ కాపీ). |
4. పథకం అమలు విధానం:
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మత్స్య అభివృద్ధి అధికారి
6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా | మెమో నెం. 124/ J1/2022 |
వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా – నిషేధ కాలం – అమలు మార్గదర్శకాలు – సవరణ | జి.ఓ.ఆర్ టి.నెం. 74, తేదీ: 06-04-2020 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబరు:18004251188 లేదా 155251
http://ematsyakar.com:8080/kcc/index.jspలేదా https://navasakam.ap.gov.in/అనే ఈ మెయిల్ అడ్రస్ కు ఫిర్యాదులనుపంపవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ ఆక్వాకల్చర్ పై మరింత సమాచారం కొరకు https://apsac.ap.gov.in/dashboard-staging/ap-aquaculture-information-system/అనే వెబ్ సైట్ చూడవచ్చు.
ఫిష్ ఆంధ్రా కాల్ సెంటర్ నెంబర్ 7416616685
1 Comment
Add a Comment