జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 కార్యక్రమం
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం అంటే ఏమిటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి మరియు అవగాహన పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ (VHC) అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పరిధి లో వైధ్య శిభిరాలను నిర్వ హించేందుకు రూపొందించిన ఒక సమగ్ర కార్యక్రమం.
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ఎప్పటివరకు జరుగుతుంది
జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 శిబిరాలు 02-01-2024 నుండి 30-06-2024 వరకు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాలలో మంగళవారం/ శుక్రవారం , పట్టణ ప్రాంతాలలో బుధవారం జరుగుతాయి.
జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల భాధ్యతలు
వాలంటీర్ ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి 20 రోజుల ముందు సందర్శించి తమ పరిధి లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్య సురక్ష 2 క్యాంప్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాలంటీర్ ఆప్ లో నమోదు చేయాలి. అలాగే ప్రజలందరూ ఆరోగ్య సురక్ష 2 కి హాజరయ్యేలా చూడాలి.