DegreeJobCareer

Degree Updates || Job Updates || VSWS Updates

Mission Vatsayala Scheme

Mission Vatsayala Scheme :: మిషన్ వాత్సల్య పథకం

కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్ షిప్ కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోంది.

మిషన్‌ వాత్సల్య పథకానికి సంబంధించిన దరఖాస్తు గడువు ఈ నెల 26 వ తేదీ వరకు పొడిగించారు.

Mission Vatsayala Scheme :: మిషన్ వాత్సల్య పథకం ఉద్దేశ్యం

18 సంవత్సరముల లోపు రక్షణ లేదా సంరక్షణ అవసరమైన పిల్లల కుటుంబాలు పిల్లలకు ఆర్థిక లేదా ఇతరత్రా అనగా పిల్లల వైద్య, విద్య మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి అనుబంధ మద్దతును అందించడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం మిషన్ వాత్సల్య క్రింద స్పాన్సర్‌షిప్ షరతులతో కూడిన సహాయం అందించడం జరుగుతుంది .ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకి నెలకు ఒక్కొకరికి రూ.4000/-లు అందించడం జరుగుతుంది.

Click Here For Application Form

స్పాన్సర్షిప్ పొందుటకు పిల్లలకు కావలసిన అర్హతలు :

1.తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.

  1. పిల్లలు అనాథలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తువున్నవారు.
  2. తల్లిదండ్రులు ప్రాణాపాయ/ప్రాణాంతక వ్యాధికి గురైన వారు.
  3. తల్లిదండ్రులు ఆర్థికంగా మరియు శారీరకంగా అసమర్థులు అయివుండి పిల్లలను చూసుకోలేని వారు.
  4. బాల న్యాయ రక్షణ చట్టం JJ Act,2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు అనగా, కుటుంబంతో లేని పిల్లలు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, బాల కార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, మిస్సింగ్ మరియు ఇంటినుంచి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు లేదా వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, సహాయం మరియు పునరావాసం అవసరమయ్యే హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన లేదా దోపిడీకి గురైన పిల్లలు.
  5. PM Cares for Children Scheme (కోవిడ్-19/కరొనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు)

Mission Vatsayala Scheme పొందుటకు ఉండవలసిన ఆర్థిక ప్రమాణాలు :

a. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆధాయం రూ.72,000/-లు కి మించరాదు.
b. పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంవత్సర ఆధాయం రూ.96,000/-లు కి మించరాదు.

స్పాన్సర్షిప్ యొక్క కాల పరిమితి :

జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా చిల్డ్రన్స్ కోర్ట్ లిఖితపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాల ఆధారంగా స్పాన్సర్‌షిప్‌ను 18 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. స్పాన్సర్‌షిప్ మద్దతు వ్యవధి మిషన్ వాత్సల్య కాలంతో సహ-టెర్మినస్‌గా ఉంటుంది.
ఏ సమయంలోనైనా పిల్లవాడిని హాస్టలో కానీ, ఏదైనా బాలసదనంలో కానీ చేర్పించిన యెడల స్పాన్సర్‌షిప్ సహాయం నిలిపివేయబడుతుందిప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విషయంలో మినహా పాఠశాలకు వెళ్లే పిల్లవాడు పాఠశాల హాజరులో 30 రోజులకు పైగా సక్రమంగా లేరని తేలితే, స్పాన్సర్‌షిప్ సహాయం సమీక్షించబడుతుంది మరియు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంధి. కావున అర్హత కలిగిన పిల్లలు వున్న యెడల సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ పరిధిలోని మహిళా పోలీసు వారిని సంప్రదించవచ్చును.

కావలసిన ధ్రువపత్రాలు

Date of birth certificate of the child
Death certificate of Deceased (Father or Mother)
Cause of death certificate : certified by the Hospital or Medical Officer
Xerox copy of COVID positive test report Of Deceased (Mother or Father)
Xerox copy of Aadhar of the child
Xerox copy of Aadhar of the father
Xerox copy of Aadhar of the mother
Xerox copy of Aadhar of the Guardian
Xerox copy of PDS Ration & Rice Card
Xerox Copy of the caste certificate
Passport size photo of the Child
Study Certificate of the Child
Xerox Copy of the Bank A/c of the Child or joint account with father or Mother or guardian

Click Here For More Details

Updated: April 14, 2023 — 3:24 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Disclaimer- We (degreejobcareer.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. DegreeJobCareer © 2023 All Rights Reserved DegreeJobCareer.com