పేదలందరికీ ఇళ్లు–ఇంటిరుణాలు
- పథకానికి సంబంధించిన వివరాలు:
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
గ్రామరెవెన్యూఅధికారి/వార్డురెవెన్యూకార్యదర్శి
- అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
ఇంటి యాజమాన్యం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లబ్ధిదారుకు స్వంత ఇల్లు/ ఇంటి స్థలం ఉండరాదు. | |
గృహ నిర్మాణ పథకం క్రింద లబ్ధి | లబ్ధిదారు గతంలో ఎటువంటి గృహ నిర్మాణ పథకం క్రింద లబ్ధి పొంది ఉండకూడదు. | |
భూ యాజమాన్యం | లబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట ఉన్నవారు మాత్రమే అర్హులు. | |
ఆధార్ కార్డు | లబ్ధిదారు సరైన ఆధార్ కార్డును కలిగి ఉండాలి. లబ్ధిదారు యొక్క అనుమతితోనే ఆధార్ వివరాలను సేకరించాలి. | |
గ్రామీణప్రాంతాలు | ||
మొత్తం కుటుంబ ఆదాయం | లబ్ధిదారు పేదరిక రేఖకు దిగువన (BPL) ఉన్న వర్గాల క్రింద గుర్తించబడిన,తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి చెందినవారు అయి ఉండాలి. | |
పట్టణ ప్రాంతాలు | ||
మొత్తం కుటుంబ ఆదాయం | లబ్ధిదారు పేదరిక రేఖకు దిగువన (BPL) ఉన్న వర్గాల క్రింద గుర్తించబడిన, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి చెందినవారు అయి ఉండాలి. |
- పథకం అమలు విధానం (ఇంటిపట్టాలు) :
- పథకం అమలు విధానం (ఇంటి రుణం)
- తక్షణ అప్పీలేట్ అథారిటీ
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- మున్సిపల్ కమీషనర్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | ఇళ్ళ స్థలాలు – “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు” – విధాన మార్గదర్శకాలు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 367, తేదీ: 19.08.2019 |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
1. | 11.12.2020 | జి.ఓ.ఎం.ఎస్.నెం. 488 |
#సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబరు:1902 లేదా www.navasakam2.apfss.inఅనే వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.