జగనన్న అమ్మ వొడి
- పథకానికి సంబంధించిన వివరాలు:
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో 1 నుండి XII (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులు లేదా పిల్లల సంరక్షకులకు (తల్లి లేనిచో) కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళు/ కాలేజీలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు/జూనియర్ కాలేజీలలో చదివించడానికి వీలుగా ఆర్ధిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
- సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు)
- వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (పట్టణ ప్రాంతాలు)
- అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
1 | మొత్తం కుటుంబ ఆదాయం | గ్రామీణ ప్రాంతాలు –నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు –నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. |
2 | మొత్తం కుటుంబానికి గల భూమి | 3ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా10ఏకరాలులోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు |
3 | తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు | తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. |
4 | ప్రభుత్వ ఉద్యోగి/ ఫించనుదారు | కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. |
5 | నాలుగు చక్రాల వాహనం | లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). |
6 | విద్యుత్ వినియోగం | గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. |
7 | ఆదాయపు పన్ను | ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు |
8 | పట్టణాల్లో ఆస్తి | మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది) |
9 | వయస్సు& లింగం | ఈ షరతు వర్తించదు |
10 | పుట్టిన తేదీ ధృవీకరణపత్రం | ఆధార్ కార్డు /సమీకృత ధృవీకరణపత్రం |
11 | బ్యాంకు ఖాతా వివరాలు | తల్లి/లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి. |
12 | హాజరు | విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి. |
గమనిక :కుటుంబంలోఎంతమందిపిల్లలుఉన్నాఒకరికిమాత్రమే ఈ పధకంవర్తిస్తుంది.
- పథకం అమలు విధానం:

- తక్షణ అప్పీలేట్ అథారిటీ
సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు (హెడ్ మాస్టర్)/ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్
- సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | జగనన్న అమ్మవొడి పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 79, తేదీ: 04-11-2019 |
#సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన నెంబర్లు:9705655349, 9705454869
ఈ మెయిల్: apcse.@ap.gov.in
1 Comment
Add a Comment